![]() |
![]() |
.webp)
దూరదర్శన్ రాజ్యమేలుతున్న రోజుల్లో అప్పుడప్పుడే వస్తున్న కొత్త కొత్త చానెల్స్ లో ప్రోగ్రామ్స్ కి ఆడియన్స్ అలవాటు పడుతున్న సమయంలో యాంకర్ గా అడుగుపెట్టింది ఝాన్సీ. అప్పట్లో ఝాన్సీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఝాన్సీ, ఉదయభాను, సుమ ఈ ముగ్గురు లేడీ యాంకర్స్ మాత్రమే అప్పటి ప్రోగ్రామ్స్ ని లీడ్ చేసేవారు. ఇక వేళల్లో ఉదయభాను, ఝాన్సీ కొంతకాలం ఆగిపోయారు. కానీ సుమా ఎక్కడ గ్యాప్ లేకుండా పని చేస్తూనే ఉంది. ఐతే ఝాన్సీ ఇటు బుల్లితెర మీద అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ మంచి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా సలార్ లో, మిస్ పర్ఫెక్ట్ మూవీస్ లో ఝాన్సీ రోల్స్ రెండూ రెండు భిన్న పార్శ్వాలలుగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే అప్ డేట్ అవుతున్న ఝాన్సీ తన పెరటి తోటలోని పంటల్ని చూపిస్తూ అలాగే తన నెక్స్ట్ మూవీస్ కి సంబందించిన అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "సలార్ లో ఓబులమ్మ గా, మిస్ పర్ఫెక్ట్ లో రాజ్యలక్ష్మిగా రెండు విభిన్న పాత్రలు చేసాను. మీ అందరి ప్రేమతో నేను నా పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేసాను.
ఈ రెండు పాత్రల పరిధిని అవి కచ్చితంగా హిట్ కొడతాయని నమ్మిన మా నాన్నకు, మేనేజర్ శ్రీనుకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. వాళ్లిద్దరూ భౌతికంగా నాతో లేకపోయినా ఆ స్వర్గం నుండి నన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. ఈ రోల్స్ ని సృష్టించిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు" అని కాప్షన్ పెట్టింది ఝాన్సీ. ఇక నెటిజన్స్ ఐతే ఈమె వీడియోకి కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. "ఓబులమ్మగా మీ రోల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మీరు చాలా బాగున్నారు ఝాన్సీ గారు" అంటున్నారు. ఝాన్సీ బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేశారు. జెమిని టీవీలో ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ ఝాన్సీ చెప్పే సినిమా ముచ్చట్ల కోసం లేడీ ఆడియన్స్ తెగ ఎదురుచూసేవారు. ఈ షో అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. ఆ తరువాత సండే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా, బ్లాక్, కో అంటే కోటి, లక్కూ కిక్కూ, నవీన, చేతన, స్టార్ మా పరివార్ ఇలా బుల్లితెర మీద ఎన్నో ఇంటరెస్టింగ్ ప్రోగ్రామ్స్ తో యాంకర్ ఝాన్సీ బుల్లితెరపై చెరగని ముద్రవేసుకున్నారు.
![]() |
![]() |